తెలంగాణలో వరదలు.. పోలవరమే కారణం

తెలంగాణలో భారీ వర్షాలు-వరదలకు క్లౌడ్ బరస్ట్ నే కారణం. దీని వెనుక విదేశాల కుట్ర ఉందని సీఎం కేసీఆర్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను సమర్థించే వారికంటే విమర్శించే వారే ఎక్కువగా కనిపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫెల్యూర్ ను పక్కదారి పట్టించేందుకే కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారని.. రాజకీయ నేతలు, కామన్ పీపుల్ మండిపడుతున్నారు. ఇదిలావుంటే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మరో బాంబు పేల్చారు.  ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు పొంచి ఉందని.. ఇటీవల వచ్చిన వరద పరిస్థితులకు అదే కారణమని పువ్వాడ అన్నారు.

భద్రాచలం ముంపు ప్రాంతానికి శాశ్వత పరిష్కారం దిశగా త్వరలోనే చర్యలు చేపడతామని చెప్పారు. తెరాస శాసనసభాక్ష కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అజయ్‌ మాట్లాడారు.  ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన 7 మండలాలు.. భద్రాచలం పక్కనే ఉన్న ఐదు గ్రామాలూ తెలంగాణలో కలపాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఏపీకి ఆ ఐదు గ్రామాలు దూరంగా ఉంటాయని.. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలన్నారు.