సమంత మనసులో రణ్ వీర్

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత బాలీవుడ్ లో రాణించాలని ఆశపడుతోంది. ఇప్పటికే ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ తో పాటు.. పలు బాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది. ఈ క్రమంలో బాలీవుడ్ నుంచి వస్తున్న కమర్షియల్ యాడ్స్ లో కనిపిస్తుంది. ప్రముఖ మేగజైన్ కవర్ పేజీలపై మెరుస్తోంది. ప్రముఖ టీవీ షోస్ లో సందడి చేస్తోంది.

ఇటీవల సమంత అక్షయ్ కుమార్ తో కలిసి కాఫీ విత్ కరణ్ సీజన్ 7 లో పాల్గొంది. దీనికి సంబంధించిన ఏపీసోడ్ ఈ గురువారం ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో ఓ ప్రోమో వదిలారు. ఇందులో సమంత – అక్షయ్ కలిసి చేసిన హడావుడి ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ హీరోల్లో ఇద్దరితో డ్యాన్స్ చేయాలంటే ఎవరి పేరు చెబుతారని.. కరణ్ అడగ్గా.. రణ్ వీర్ సింగ్ & రణ్ వీర్ సింగ్ అంటూ రెండు సార్లు ఆయనే పేరే చెప్పింది. ఇక పర్సనల్ గురించి కూడా ఈ షోలో సామ్ స్పందించింది. ఆ పూర్తి వివరాలు తెలియాలంటే కంప్లీట్ ఏపీసోడ్ చూడాల్సిందే. 

#KoffeeWithKaran S7 on @DisneyPlusHS@Samanthaprabhu2 @akshaykumar
#SamanthaRuthPrabhu #samantha pic.twitter.com/ph0tWl3Tpa— OTTRelease (@ott_release) July 19, 2022