Dunki : షారుఖ్ లుక్ లీక్

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో ‘జవాన్’ తెరకెక్కుతుండగా.. రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో డంకి (Dunki) రూపుద్దిద్దుకుంటోంది. ఏప్రిల్ లోనే షూటింగ్ షురూ అయింది. ప్రస్తుతం లండన్ లో షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా సెట్స్ నుంచి షారుఖ్ పిక్ ఒకటి లీకైంది.

ఫ్యాన్స్ గ్రూప్ లో హల్ చల్ చేస్తోంది. ఇందులో షారుఖ్ సింపుల్ చెక్ షర్ట్, బ్లాక్ పాయింట్, చేతికి కడియం ధరించి మ్యాసీ లుక్ లో కనిపిస్తున్నారు. లండన్ తర్వాత యూరప్ షెడ్యూల్ ఉండనుంది. భారత్ కు తిరిగొచ్చాక పంజాబ్ లో ఓ షెడ్యూల్ ప్లాన్ చేశారు. రాజ్ కుమార్ హిరాణి – షారుఖ్ కలయికలో వస్తున్న తొలి చిత్రమిది. తాప్సీ పన్ను హీరోయిన్. రెడ్ చిల్లర్ ఎంటర్టైన్మెంట్, జియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.