హీరోయిన్ గా బిజీ అవుతున్న సింగర్

షెర్లీ సెటియా – డామన్ లో పుట్టింది. న్యూజిలాండ్ లో పెరిగింది. మార్కెటింగ్ & పబ్లిసిటీ ఇంటర్న్ లో డిగ్రీ పూర్తి చేసింది. గాయనిగా కెరీర్ ప్రారంభించింది. బాలీవుడ్ లో 20కి పైగా పాటలు పాడింది. హీరోయిన్ గా టర్న్ తీసుకుంది. ‘మస్కా’ సినిమాతో బాలీవుడ్ కు పరిచయం అయింది.

ప్రస్తుతం ‘నీకమ్మ’ సినిమాలో నటిస్తుంది. బాలీవుడ్, టాలీవుడ్ లోనూ మరిన్ని ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్న ఈ యంగ్ బ్యూటీ.. తన అందచందాలను పబ్లిసిటీ చేసుకునే పనిలో ఉంది. తాజాగా ట్రెండీ లుక్ లో కనిపించింది. ఈ కలర్ ఫుల్ పిక్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏడాదే తెలుగు తెరకు పరిచయం అయింది షెర్లీ సెటియా. ‘కృష్ణ వ్రిందా విహారి’లో నాగ శౌర్యకు జంటగా నటించింది.