నయన్-75, త్రిష-56, తమన్నా-54
50.. 60 దాటిన హీరోయిజం చూపించొచ్చు. కానీ హీరోయిన్స్ విషయంలో అలా కాదు. ముప్పై దాటితే.. కెరీర్ దాదాపు ముగిసినట్టే. అయితే ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితిలో మార్పు కనిపిస్తున్నది. నటిగా రెండు దశాబ్దాల అనుభవం సంపాదిస్తున్నారు. ఈ జాబితాలో నయనతార టాప్ లో కనిపిస్తారు. ఆమె ఇటీవల తన 75వ చిత్రాన్ని ఖరారు చేశారు. ‘మానస్సినక్కరే’ అనే మలయాళ సినిమాతో 2003లో తెరంగేట్రం చేశారు నయనతార. ‘చంద్రముఖి’, ‘వల్లభ’ తదితర డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ఆమె ‘లక్ష్మీ’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ‘బాస్’, ‘యోగి’, ‘దుబాయ్ శీను’, ‘తులసి’, ‘బిల్లా’, ‘అదుర్స్’, ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’, ‘గ్రీకు వీరుడు’ తదితర సినిమాల్లోని విభిన్న పాత్రలతో విశేషంగా ఆకట్టుకున్నారు.
త్రిష-56 నాటౌట్. ‘మౌనం పెసియాదే’ అనే తమిళ సినిమాతో నాయికగా మారిన త్రిష ‘వర్షం’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో 56 చిత్రాలు చేశారు. మణిరత్నం దర్శకత్వంలో త్రిష నటించిన ‘పొన్నియిన్ సెల్వన్’ ( Ponniyin Selvan) సెప్టెంబరు 30న విడుదల కానుంది. ఇక మిల్కీ బ్యూటీ తమన్నా-54 నాటౌట్. అదే ఏడాది ‘శ్రీ’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమమ్యారు. ‘హ్యాపీడేస్’తో అందరి దృష్టిని ఆకర్షించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఇప్పటి వరకూ తమన్నా 54 సినిమాల్లో కనిపించారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. అనుష్క 39, సమంత 41, తాప్సీ 38 సినిమాలు పూర్తి చేశారు. ఇప్పటికీ తమ సత్తా చాటుతున్నారు.