ఈసారి టీఆర్ఎస్ ను గెలిపించేది పవన్ నే !?

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. అప్పటి వరకు న్యూట్రల్ అనుకునేవారు.. సడెన్ గా రైజ్ కావొచ్చు. ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారవచ్చు. ఇప్పుడు తెలంగాణలో జనసేన అత్యంత కీలక శక్తిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వాస్తవానికి ఏపీ మీద ఫోకస్ చేసినట్టుగా.. తెలంగాణపై దృష్టి సారించలేదు పవన్. కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోనూ జనసేన పోటీ చేస్తుందని ఆ మధ్య నల్గొండ పర్యటనకు వెళ్లిన సందర్బంలో పవన్ ప్రకటన చేశారు. అయితే పవన్ పోటీ వెనక టీఆర్ఎస్ ఉంది. టీఆర్ ఎస్ వ్యతిరేక ఓటును చీల్చడానికే పవన్ ను గులాబి పార్టీ పోటీకి దింపుతుంది అనే ప్రచారం జరిగింది. ఇందులో నిజం లేకపోలేదు. కానీ పవన్ ఒక్కడే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగడం లేదు. ఆయనకు కొన్ని ప్రశ్నించే గొంతుకలు తోడవ్వనున్నాయన్నది లేటెస్ట్ సమాచారం. 

గత కొన్నేళ్లుగా టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా.. ఇంకా చెప్పాలంటే సీఎం కేసీఆర్ కుటుంబానికి బద్ద శత్రువుగా తయారైన వ్యక్తితో జనసేన చేతులు కలపనుంది. ఇప్పటికే తెర వెనక ముచ్చట్లు అయిపోయినవి. త్వరలో వీరిద్దరు కలిసి ఓ ప్రెస్ మీట్ లాంటిది నిర్వహించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. వీరి కలయికలో మెగా బ్రదర్ నాగబాబు కీలక పాత్ర పోషించినట్టు కనబడుతోంది. మరోవైపు, ఈ కలయిక వెనుక టీఆర్ఎస్ హస్తం ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

ప్రస్తుతం టీఆర్ ఎస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. మునుపటిలా కేసీఆర్ మాట పారడం లేదు. ఆయన ఏం చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. దాదాపు పదేళ్ల పాలనలో ఏ ప్రభుత్వానికైనా.. ఇలాంటి వ్యతిరేకత సహజమే. ఈ నేపథ్యంలో 2014, 2018లో మాదిరిగా మరోసారి టీఆర్ఎస్ అధికారంలో రాబోతుందని గట్టిగా చెప్పడానికి అవకాశం లేదు. కాంగ్రెస్, బీజేపీ బాగా బలపడ్దాయి. కేసీఆర్ సర్కారుకు సవాల్ విసురుతున్నాయి.

ఈ నేపథ్యంలో చీలిక రాజకీయాలే టీఆర్ఎస్ ను గట్టించే పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. మరెన్ని వ్యూహాలు రచించిన యువతలో టీఆర్ ఎస్ పట్ల ఉన్న వ్యతిరేకతను దూరం చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ఓ బ్రహ్మాస్త్ర రెడీ చేశారు. అదే జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్  కళ్యాణ్ అంటున్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో జనసేన పోటీకి దిగనుంది. అది కూడా ప్రశ్నించే గొంతుకలను కలుకొని. వీరి పోరాటంలో నిజాయితీ.. కేసీఆర్ సర్కారును గద్దె దించాలనే కసి ఉన్నా.. ఫైనల్ గా ది కారు పార్టీకే కలిసి రానుంది.

పవన్ చెప్పినట్టుగా ఒక్కో నియోజకవర్గానికి కనీసం 5నుంచి 10 వేల ఓట్లు పడతాయి. కానీ ఆయనకు తోడు ప్రశ్నించే గొంతుకలు కలిస్తే.. ఆ ఫిగర్ 10 నుంచి 20 వేలకు చేరడం గ్యారెంటీ. తద్వారా కారు గుర్తుకి కచ్చితంగా పడవని భావిస్తున్న యువత ఓటు చీలిపోనుంది. దీంతో కారు మైలేజ్ మరింత పెరగనుంది. మరీ.. తెలిసే ప్రశ్నించే గొంతుకలు పవన్ తో కలిసి పోవాలని భావిస్తున్నాయా ? అంటే.. అది దేవుడికే తెలియాలి.