ఇంత దారుణమా ? లో దుస్తులు విప్పేయించి పరీక్ష రాయించారా ?
ఆదివారం జరిగిన నీటి పరీక్ష సందర్బంగా పరీక్ష కేంద్రంలో తమకు ఎదురైన అవమానాలను బాధిత విద్యార్థిని ఓ టీవీ ఛానల్ తో పంచుకుంది. పరీక్ష కేంద్రంలోకి వెళ్లగానే విద్యార్థినుల తనిఖీల కోసం రెండు లైన్లు ఏర్పాటు చేశారు. లోదుస్తులు విప్పేయాలని మహిళా సిబ్బంది ఆదేశించారు. అక్కడే ఉన్న డ్రాలో వాటిని పెట్టాలన్నారు. అబ్బాయిలు, అమ్మాయిల దుస్తులన్నీ ఒకే చోట ఉంచారు. పరీక్ష హాలులో అందరూ కలిసే కూర్చున్నారు.
మెడలో చున్నీలాంటివి కూడా లేవు. మా జుట్టును ముందుకు వేసుకొని పరీక్ష రాశాం. చాలా అవమానంగా అనిపించింది. పరీక్షపై సరిగా దృష్టిసారించలేకపోయామని వివరించింది. అంతేకాదు.. పరీక్ష కేంద్రం నుంచి తిరిగి వెళ్లేటప్పుడు కూడా లోదుస్తులు ధరించొద్దని సిబ్బంది చెప్పారని విద్యార్థిని వాపోయింది. దుస్తులు వెంట తీసుకొని వెళ్లిపోవాలని చెప్పారు. అధికారులు వద్దన్నా కొందరు విద్యార్థినులు అక్కడే గదిలో చీకటిగా ఉన్నచోటకు చేరి, లోదుస్తులు ధరించి ఇంటికి వెళ్లారు. ఈ విద్యార్థిని ఫిర్యాదు మేరకు పరీక్ష కేంద్రంలో ఎన్టీఏ తరఫున విధులు నిర్వహించిన ముగ్గురు మహిళలను, విద్యా సంస్థకు చెందిన ఇద్దరు మహిళలను మంగళవారం కేరళ పోలీసులు అరెస్టు చేశారు.