నెట్‌ఫ్లిక్స్‌కు షాక్.. 10 లక్షల సబ్‌స్క్రైబర్లు గుడ్‌బై !
నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ తగిలింది. ఏప్రిల్-జులై మధ్య నెట్‌ఫ్లిక్స్ ఏకంగా 10 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు గుడ్ బై చెప్పేశారు. ఈ వేదికను వీడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. కెనడా, అమెరికాలో అత్యధిక మంది నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసుకున్నారు. తర్వాత ఐరోపా దేశాలు ఆ జాబితాలో ఉన్నాయి.
మార్కెట్‌లోని ప్రత్యర్థి సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీ, సబ్‌స్క్రిప్షన్ ధరలు పెరగడమే సబ్‌స్క్రైబర్ల తగ్గుదలకు కారణంగా తెలుస్తోంది. మరోవైపు ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఉద్యోగులు ఆఫీసులకు వెళుతున్నారు. పిల్లలు, యువకులు తమ చదువులపై శ్రద్ధ వహిస్తున్నారు. ఈ క్రమంలోనే స్ట్రీమింగ్‌పై ఆదరణ తగ్గిందన్నది మరో అంచనా. కారణం ఏదైనా.. ప్రపంచ వీడియో స్ట్రీమింగ్ రంగంలో రారాజుగా కొనసాగుతున్న నెట్‌ఫ్లిక్స్ ఆ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ఇప్పుడు పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.