స్టార్ హీరోతో నిత్యామీనన్ పెళ్లి ?

హీరోయిన్ నిత్యామేనన్‌ త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. స్టార్ హీరోను పెళ్లాడనుందని సమాచారం. వీరిది ప్రేమ వివాహమని కూడా చెప్పుకుంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ కథనాల ప్రకారం.. మలయాళీ పరిశ్రమకు చెందిన ఓ స్టార్‌ హీరోతో ఆమె పెళ్లి జరగనుందని సమాచారం.


స్నేహితుల ద్వారా పరిచయమైన వీళ్లిద్దరూ ఎన్నో ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్నారని, ఈ క్రమంలోనే తమ ప్రేమ విషయాన్ని ఇటీవల ఇరు కుటుంబసభ్యులకు తెలిపారని.. పెద్దలు అంగీకరించడంతో త్వరలోనే ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నారని చెప్పుకుంటున్నారు. నిత్య కు సినిమాలే లోకం కాదు. ఆమెకు మరిన్ని వ్యాపకాలు  ఉన్నాయి. సంగీతం ప్రియురాలు. ఆల్భమ్స్ చేయడం అలవాటు. పలు సందర్భాల్లో సినిమాల నుంచి బ్రేక్ తీసుకొని నచ్చిన పని చేసింది. ఇప్పుడు పర్సనల్ లైఫ్ కోసం మరోసారి సినిమాల నుంచి బ్రేక్ తీసుకోనుంది. పెళ్లి పీటలు ఎక్కనుందని చెప్పుకుంటున్నారు. మరీ.. ఈ వార్తలపై నిత్యా స్పందించాల్సి ఉంది.