రకుల్.. చిన్నారి నవ్వులు !

టైమింగ్ తెలిసిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. అందుకే చాలా ఫాస్ట్ గా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. టాలీవుడ్, కోలీవుడ్ లో దున్నేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ బిజీ. అక్కడ బ్యాక్ టు బ్యాక్ ఏడెనిమిది సినిమాలు పడ్డాయి. వీటిలో రెండు సినిమాలు ఎటాక్, రన్ వే 34 ఇప్పటికే రిలీజ్ అయ్యాయి.

మరో అరడజను సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. డాక్టర్ జీ, థ్యాంక్ గాడ్, అయాలన్, మిషన్ సిండ్రెల్లా, ఛత్రివాలి, 31 అక్టోబర్ లేడీస్ నైట్.. ఇలా క్యూ ఉంది. చేతిలో ఉన్న సినిమాలన్నింటిని పూర్తి చేసిన రకుల్ ఇప్పుడు ఖాళీ. అందుకే తనదైన శైలిలో పబ్లిసిటీ చేసుకుంటోంది.

మునుపటిలా హాట్ హాట్ ఫోటో షూట్స్ తో హీటెక్కించే ప్రయత్నంలో ఉంది. మరోవైపు చిన్నపిల్లలా మారి.. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కట్టిపడేస్తోంది. తాజాగా రకుల్ ఓ సరదా పిక్ ను షేర్ చేసింది. దానికి కిడ్స్ ఎక్స్ ప్రెషన్స్ ను కామెంట్ గా పెట్టింది.