టాండన్.. తగ్గేదేలా.. !!

రవీనా టాండన్ తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైన నటి. ‘బంగారు బుల్లోడు’ సినిమాతో ఆమె తెలుగు తెరకు పరిచయం అయింది. ఆకాశ వీధిలో, రధసారధి, పాండవులు పాండవులు తుమ్మెద సినిమాల్లో నటించింది. తెలుగుతో పాటు, తమిళ్, బెంగాళీ చిత్రాల్లో టాండన్ నటించింది. కేజీఎఫ్ 2 తో ఈ సీనియర్ హీరోయిన్ పేరు మరోసారి మారుమ్రోగింది. రమికాసేన్ పాత్రలో టాండన్ పవర్ హౌస్ పర్ఫామెన్స్ ఇచ్చింది. పవర్ ఫుల్ రోల్స్ కి తాను బెస్ట్ ఆప్షన్ అని నిరూపించుకుంది.


ఇక ఈ సినిమా హిట్ కిక్ లో ఉన్న టాండన్ తరచూ కెమెరా ముందుకు వస్తోంది. ట్రెండీ లుక్ లో అదరగొడుతోంది. 47 ఏళ్ల వయసులోనూ క్లీవేజ్ షోతో అదరగొడుతోంది. యంగ్ హీరోయిన్స్ కి సవాల్ విసురుతోంది. తాజాగా బ్లూ కలర్ డ్రెస్.. మెరిసే లిలక్ అవుట్ ఫిట్ లో ఆకట్టుకుంది. పర్ ఫెక్ట్ ఫిగర్ తో మెస్మరైజ్ చేసింది. అవకాశం ఇస్తే.. ఇప్పటికీ హీరోయిన్ గా సత్తా చాటుతానని చెప్పకనే చెబుతోంది.