సమంత, చైతూ.. బాలీవుడ్ లో సందడి !

సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకున్నారు. ఎవరి బతుకు వారు బతుకుతున్నారు. అయితే కెరీర్ పరంగా కసిగా ఉన్నారు. తామేంటో నిరూపించుకోవాలని తాపత్రయపడుతున్నారు. మరీ.. ముఖ్యంగా సమంత బాలీవుడ్ లో సత్తా చాటాలని ఆశపడుతోంది. ఇప్పటికే పుష సినిమాలో ఐటమ్ సాంగ్ తో బాలీవుడ్ ను షేక్ చేసింది. ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ తో పాటు పలు బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సమంత యశోద సినిమా బాలీవుడ్ లో రిలీజ్ కాబోతుంది.

ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా బాలీవుడ్ లో వరుసగా టీవీ షోస్ లో కనిపిస్తుంది సామ్. తన సినిమాను ప్రమోట్ చేసుకుంటోంది. మరోవైపు నాగచైతన్య బాలీవుడ్ సినిమా ప్రమోషన్ హడావుడి కూడా మొదలైంది.

హాలీవుడ్ సినిమా ఫారెస్ట్ గంప్ కు రీమేక్ గా రూపొందిన లాల్ సింగ్ చద్ధా విడుదలకు సన్నద్ధం అవుతోంది. ఇందులో నాగచైతన్య ఒక ముఖ్యమైన పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లో నాగ చైతన్య భాగస్వామి అవుతున్నాడు. ఇలా ఈ మాజీ భార్యాభర్తలు ఒకేసారి బాలీవుడ్ లో సందడి చేస్తున్నారు. ఒకవేళ తారసపడితే.. పలకరించుకుంటారేమో చూడాలి.. !