Victim – 4 ఏపీసోడ్స్, 4గురు టాప్ డైరెక్టర్స్

తమిళ ఆంథాలజీ Victim ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. నాలుగు ఎపిసోడ్స్ గా తెరకెక్కిన ఈ సిరీస్ కు నలుగురు దర్శకత్వం వహించారు. చింబు దేవన్, ఎం రాజేష్, పా.రంజిత్ మరియు వెంకట్ ప్రభు డైరెక్ట్ చేశారు. ప్రసన్న, అమలా పాల్, ప్రియా భవానీ శంకర్, నాజర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఈ వెబ్ సిరీస్  ఆగస్టు 5 నుంచి సోనీ లైవ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో వేగం పెంచిన చిత్రబృందం వరుసగా అప్ డేట్స్ ఇస్తోంది. ఈ క్రమంలో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఉత్కంఠకు గురి చేసే సన్నివేశాలతో ట్రైలర్ అదిరిపోయింది. ప్రచార చిత్రాలు ఆకట్టుకునేలా ఉండటంతో.. ఈ సిరీస్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి సామ్ సి ఎస్ సంగీతం అందించారు.