ధనుష్.. ది గ్రేట్ !

కోలీవుడ్ స్టార్ అద్భుతమైన నటుడు. ఇప్పటికే జాతీయ అవార్డు అందుకున్నాడు. బాలీవుడ్ లోనూ  సినిమాలు చేశారు. అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు హాలీవుడ్ లో తన సత్తా చాటబోతున్నాడు. ఆంథోనీ రస్సో, జో రస్సో దర్శకత్వంలో తెరకెక్కిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ The Gray Man. ఈ చిత్రంలో ధనుష్ ఓ కీలక పాత్రలో నటించారు. Avik San పాత్రలో కనిపించబోతున్నారు. జులై 22న  ది గ్రే మేన్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్ ఇప్పటికే ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇటీవల హాలీవుడ్ లో జరిగిన ప్రీమియర్ వేడుకకు ధనుష్ హాజరయ్యారు. తన వెంట తన ఇద్దరు కొడుకులని తీసుకెళ్లారు. ఈ సందర్బంగా హాలీవుడ్ లుక్ లో ఆకట్టుకున్నారు. అయితే ఇప్ప్పుడు ది గ్రే మేన్ టీమ్ ఇండియాకు వచ్చింది. ముంబైలో నిర్వహించిన ప్రీమియర్ షోకు దర్శకులిద్దరు హాజరయ్యారు. ఇక ఈ ప్రీమియర్ షోకి బాలీవుడ్ ప్రముఖులు అమీర్ ఖాన్, విక్కీ కౌశల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ధనుష్ వ్యవహరించిన తీరు ఆకట్టుకుంది. హాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ వచ్చినా.. సంప్రదాయ పంచెకట్టులో కనిపించారు. అంతేకాదు.. హాలీవుడ్ స్టార్స్ తో సమస్కార్ చేయిస్తూ కనిపించారు. అంతేకాదు.. బాలీవుడ్ స్టార్స్ తో ఎంతో ఆప్యాయంగా మెలగడం చూడొచ్చు. ఇవన్నీ చూసిన అభిమానులు.. ధనుష్ గొప్పోడు. ఇప్పుడు గ్లోబల్ స్టార్ అని కితాబిచ్చారు.. ఇకపై హాలీవుడ్ లోనూ ధనుష్ వరుస సినిమాలు చేయాలని ఆకాంక్షిస్తున్నారు.