లైగర్ ట్రైలర్ టాక్

‘ఐయామ్ ఫైటర్’ అంటూ గర్జించారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా ‘లైగర్’. మథర్‌ సెంటిమెంట్‌, కిక్‌ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో విజయ్‌కు తల్లిగా అలనాటి నటి రమ్యకృష్ణ కీలకపాత్ర పోషించారు. అనన్యపాండే కథానాయిక. పూరీ కనెక్ట్స్‌, ధర్మా ప్రొడెక్షన్స్‌ పతాకంపై ఛార్మి, కరణ్‌ జోహార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టు 25న లైగర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా టైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘ఒక లయన్‌కి టైగర్‌కి పుట్టిండాడు. క్రాస్‌ బ్రీడ్‌ సార్‌ నా బిడ్డ’’  అంటూ రమ్యకృష్ణ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమైంది. యాక్షన్‌ సీక్వెన్స్‌లలో విజయ్‌ దేవరకొండ‌ చేసిన స్టంట్స్‌ అదిరిపోయాయి. డిఫరెంట్ లుక్స్ తో ఆకట్టుకున్నాడు. ప్రముఖ బాక్సర్‌ మైక్‌టైసన్‌తో బాక్సింగ్‌ సన్నివేశాలు, అనన్యతో రొమాన్స్‌.. ఇలా ప్రతి సీన్ ఆకట్టుకుంది. పూరి మార్క్ టేకింగ్ కొట్టొచ్చినట్లు కనబడుతుంది. అది పూర్తి స్థాయిలో వర్కవుట్ అయితే.. మరో అమ్మా నాన్న తమిళ అమ్మాయి, పోకిరి రేంజ్ హిట్ పాన్ ఇండియా స్థాయిలో దక్కినట్టే.