#Netflixలో నయన్ లవ్ స్టోరీ

సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార అభిమానులకు నెట్ ఫ్లిక్స్ గుడ్ న్యూస్ చెప్పింది. విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. అసలు విషయం ఏంటంటే ? గత నెల 9న మహాబలిపురంలో నయనతార-విగ్నేష్ శివన్ వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అతికొద్ది మంది సన్నిహితులు, స్నేహితులు, సెలబ్రిటీల మధ్య..  కేవలం కుటుంబ వేడుకగా వివాహ వేడుక జరిగింది. పెళ్లి తర్వాత కొన్ని ఫోటోలు, వీడియోలు మాత్రమే అభిమానులతో పంచుకున్నారు నయన్-విగ్నేష్. అయితే మొత్తం వీడియో చూడాలన్నది అభిమానుల కోరిక. ఇప్పుడు ఆ కోరికను నెట్ ఫ్లిక్స్ తీర్చబోతుంది.

వాస్తవానికి నయన్-విగ్నేష్ ల పెళ్లి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. నెట్ ఫ్లిక్స్ లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది అనే ప్రచారం జరిగింది. ఇందుకోసం నయన్ – విగ్నేష్ లకు కోట్ల రూపాయలు ఇవ్వనుంది. పెళ్లిని కూడా కమర్షియల్ చేసేశారు అనే వార్తలు వినిపించాయి. అయితే పెళ్లి లైవ్ స్ట్రీమింగ్ కాకపోవడంతో.. ఈ ప్రచారంలో నిజం లేదనుకున్నారు. కానీ పోస్ట్ రిలీజ్ సినిమా మాదిరిగా.. పెళ్లి తర్వాత విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు నెట్ ఫ్లిక్స్ ఒప్పిందం చేసుకున్నట్టు తెలుస్తుంది. తాజాగా త్వరలోనే నయన్-విగ్నేష్ మ్యారేజ్ వీడియోలు అంటూ నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. పెళ్లి మాత్రమే కాదు. వీరి లవ్ స్టోరీని ప్రజెంట్ చేయనున్నారు.

ఈ జంట దాదాపు ఏడేళ్లుగా ప్రేమలో ఉంది. విహార యాత్రలు, పార్టీలు అంటూ కలిసి తిరిగారు. కొన్ని సందర్భాల్లో ఈ జంట విడిపోయిందనే ప్రచారం కూడా జరిగింది. అయితే తమ ప్రేమ గొప్పది అంటూ.. మళ్లీ కలుస్తూ.. ప్రేమను పంచుకుంటూ ముందుకు సాగారు. మరోవైపు వీరిద్దరికి ఆల్రెడీ పెళ్లైంది. కలిసి కాపురం కూడా పెట్టేశారనే వార్తలు షికారు చేశాయి. అవన్నీ దాటుకొని.. ఈ ప్రేమజంట వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. పెళ్లి తర్వాత హనీమూన్ వెళ్లొచ్చిన నయన్, విఘ్నేశ్ ప్రస్తుతం ఎవరి సినిమా పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. అట్లీ-షారుఖ్ సినిమాలో నయన్ నటిస్తుంది. విగ్నేష్ అజిత్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే పనుల్లో ఉన్నారు. అయితే, ఆదివారం, హాలీడేస్ లో ఈ జంట ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. 

#Netflix has confirmed a documentary on the celebrity couple #Nayanthara & #VigneshShivan‘s love story. pic.twitter.com/Ydi11AnHqY— OTTRelease (@ott_release) July 21, 2022