పరంపర 2.. డోంట్ మిస్ !

గత ఏడాది వచ్చిన తెలుగు వెబ్ సిరీస్ “పరంపర”. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ సిరీస్ కు కృష్ణ విజయ్ ఎల్, విశ్వనాథ్ అరిగెల దర్శకత్వం వహించాడు. ఈ సిరీస్ 24 డిసెంబర్ 2021న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో విడుదలైంది. సంచలనం విజయం సాధించింది. ఇప్పుడు రెండో సీజన్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది.

మొదటి సీజన్ కథని ముందుకు నడిపిస్తూ మరో సంచలనంగా హాట్ స్టార్ ప్రేక్షకులకు కొత్త తరహాలో కథా సంవిధానం అద్భుతం అనిపిస్తోంది. నాయుడు, గోపి మధ్య మొదలైన యుద్ధం ఏ మలుపు తీసుకుంటుందో ఊహించని మజిలీలతో ఆసక్తి రేపుతున్న “పరంపర సీజన్ 2” గురువారం నుంచి హోస్ట్ స్టార్  లో స్ట్రీమింగ్ అవుతోంది. పాయింట్ బ్లాంక్ కి భయపడకుండా, ఎదురువెళ్ళి తెగబడే ఓ యువకుడి ధైర్యం ప్రపంచానికి వినిపించిన ఒక కొత్త స్వరం “పరంపర” సీజన్ 2. ప్రేమ, ప్రతీకారాల మధ్య.. నమ్మిన సిద్ధాంతం ఎవరిని ఎటు నడిపించిందో.. ఏ బంధాన్ని ఏ తీరానికి చేర్చిందో తెలుసుకోవాలంటే “పరంపర” సీజన్ 2 చూడాల్సిందే. 

#Parampara Now Streaming on @DisneyPlusHS
@Naveenc212 @Shobu_@arkamediaworks #ParamparaAgain #ParamparaOnHotstar #OTTUpdates#OTTRelease #Hotstar pic.twitter.com/JDpJNoPizn— OTTRelease (@ott_release) July 21, 2022