#ProjectK.. వీడియో లీక్

డార్లింగ్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఆయన స్పీడు చూసి జనాలు భయపడిపోతున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం చిత్రం ‘ప్రాజెక్ట్ K’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. తాజా షెడ్యూల్ లో జాయిన్ అవ్వడానికి దీపికా పదుకొనె హైదరాబాద్ లో దిగింది. అయితే మంగళవారం రాత్రి జరిగిన షూటింగ్ సంబంధించిన ఓ సీన్ లీకైంది. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

లంబోర్ఘిని కారులో ప్రభాస్ రయ్.. రయ్యిమని దూసుకుపోతున్న సీన్ అది. జేమ్స్ బాండ్ సినిమాలోని సీన్ ను తలపించింది. సోషల్ ఫాంటసీ సినిమా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కె లో యాక్షన్ కు కొదవలేదని ఈ లీక్ సీన్ తో అర్థమవుతోంది. అయితే ఇలాంటి రిస్కీ సీన్ లో ప్రభాస్ నటిస్తున్నారనే విషయం తెలిసి ఆయన అభిమానులు భయపడిపోతున్నారు. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

పురాణాలను, టైమ్ మెషీన్ కాన్సెప్ట్ ను మిక్స్ చేస్తూ చేస్తున్న మైథలాజికల్ ఫాంటసీ సినిమా ఇది. విష్ణుమూర్తి కల్కి అవతారం కథ, అలాగే ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వద్ధామ పాత్రలను బేస్ చేసుకుని నాగ్ అశ్విన్ ఈ కథను రెడీ చేసినట్టు తెలిసింది.  అశ్వద్ధామ పాత్రలో బిగ్ బీ అమితాబ్, కల్కీ అవతార్ లో ప్రభాస్ కనిపించబోతున్నారని సమాచారం. దాదాపు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్ తో వైజ‌యంతీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

#Prabhas with his Lamborghini on the sets of #ProjectK last night Speed check karo 🔥 pic.twitter.com/4TuAGbbOK9— OTTRelease (@ott_release) July 20, 2022