కేంద్రం కొరఢా.. 94 యూట్యూబ్‌ ఛానెళ్లపై నిషేధం !

నకిలీ వార్తలు వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కొన్ని యూట్యూబ్‌ ఛానెళ్లను కేంద్రం నిషేధించింది. తాజాగా 94 యూట్యూబ్‌ ఛానెళ్లు, 19 సోషల్‌ మీడియా ఖాతాలు, 747 URLలపై నిషేధం విధించింది. ఈ మేరకు వైకాపా ఎంపీ అయోధ్య రామిరెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌-2020 కింద డిజిటల్‌ మాధ్యమాల ద్వారా నకిలీ వార్తల వ్యాప్తి అరికట్టడానికి… గతేడాది ఫిబ్రవరి 25 ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రూల్స్‌ 2021ను రూపొందించినట్లు మంత్రి తెలిపారు. దాని ప్రకారం ఏదైనా యూట్యూబ్‌ ఛానెల్‌, సోషల్‌ మీడియా ఖాతా కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, కోడ్‌లు ఉల్లంఘించినట్లు గుర్తించినట్లయితే చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.