తెలంగాణలో మరో ఉప ఎన్నిక ?

తెలంగాణలో మరో ఉప ఎన్నిక రానుందా ? అంటే.. అవుననే అంటున్నారు. తెలంగాణలో బీజేపీ బలపడింది. ఉప ఎన్నికలే పునాదిగా ఆ పార్టీ ఎదుగుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ గెలుచుకుంది ఒకే ఒక్క సీటు. గోషామహల్ నుంచి రాజా సింగ్ గెలిచారు. ఆ తర్వాత వచ్చిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో నాలుగు స్థానాలు గెలుచుకుంది. కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కుమార్ కు తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించారు. అప్పటి నుంచి బీజేపీ పరిస్థితి మారుతూ వచ్చింది. క్రమంగా పుంజుకుంటోంది.

దుబ్బాక ఉప ఎన్నికలో రఘునందన్ రావు, హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ గెలుపొందారు. దీంతో తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ బలం 3కి పెరిగింది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ లో సంచలన ఫలితాలు రాబట్టింది కమలం పార్టీ. ఓ దశలో టీఆర్ఎస్ కు ఏకైక ప్రత్యామ్నాయం అనిపించుకుంది. అయితే ఇటీవల కాలంలో కాంగ్రెస్ పుంజుకోవడంతో.. నెంబర్ 2 స్థానం కోసం ఈ రెండు పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అని నిరూపించుకొనే పనిలో ఉన్నాయి.

ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ నేతలు మరో ఉప ఎన్నిక కోరుకుంటున్నట్టు కనబడుతోంది. బీజేపీలో చేరడానికి ఎప్పట్నుంచో ప్రయత్నస్తున్నారు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్. దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. దీని వెనక బీజేపీ వ్యూహాం ఉందని కొందరు. కాదు.. స్థానికంగా రాజగోపాల్ రెడ్డికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, క్యాడర్ తన వెంట రానంటోంది. అందుకే ఆయన కమలతీర్థం పుచ్చుకోవడంలో ఆలస్యం అవుతుందని మరికొందరు అంటున్నారు.

ఫైనల్ గా కోమటి రెడ్డి బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్సయినట్టు తెలుస్తుంది. ఇప్పటికే జేపీ నడ్డా, అమిత్ షా లతో రాజ్ గోపాల్ రెడ్డి రెండు సార్లు భేటీ అయ్యారు. అంతేకాదు.. ఈరోజు తన నియోజవర్గంలోని చల్లూరులో రాజగోపాల్ రెడ్డి సమావేశం కావాల్సి ఉంది. కానీ అనారోగ్య కారణాల వలన పోస్ట్ చేసుకున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఆయన కార్యకర్తలతో భేటీ కాబోతున్నారు. ఆ తర్వాత బీజేపీలో చేరే విషయం పై అధికారిక ప్రకటన చేయబోతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు మరో ఉప ఎన్నికలో గెలిచిన ఉత్సాహంగా అసెంబ్లీ ఎన్నికలకు పోవాలని తెలంగాణ బీజేపీ భావిస్తోంది. అందుకే పక్కా ప్లానింగ్ తో ఎన్నికలకు కొద్ది రోజుల ముందు రాజగోపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకొనే పని పెట్టుకుంది అంటున్నారు.