అనుపమ్ ఖేర్ ‘ఎమర్జెన్సీ’ లుక్

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాని పీఠంపై కూర్చోబోతున్న సంగతి తెలిసిందే. ఆమె లీడ్ రోల్ లో ‘ఎమర్జెన్సీ’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో కంగనా మాజీ భారత ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల ఇందిరా గాంధీగా కంగనా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇందిరా పాత్రలో కంగనా ఒదిగిపోయిన తీరు ఆకట్తుకుంది. తాజాగా అనుపమ్ ఖేర్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో ఆయన జయప్రకాష్ నారయణణ్ పాత్రలో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి కథ, దర్శకత్వం కంగనానే. మణికర్ణిక తర్వాత మరోసారి ఆమె దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భారత రాజకీయాల్లో అత్యంత కీలక అంశం ఎమర్జెన్సీ. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ  1975 నుంచి 1977 వరకు 21 నెలల పాటు ఎమర్జెన్సీ విధించారు. ఆ సమయంలో ప్రజల ప్రాథమిక హక్కులకు ఎలా భంగం కలిగాయి అన్నది సినిమాలో  కీలకంగా చూపించబోతున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. జనతా పార్టీ రూపంలో బలమైన ప్రతిపక్షం తయారైంది.