ఆ ఫ్లాట్ లాస్ కు అమ్మేశాడు

ప్రేమ గుడ్డిది. దాన్ని నిజం చేస్తూ.. 48 ఏళ్ల మలైకా అరోరా 37 ఏళ్ల అర్జున్ కపూర్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోతున్న విషయం తెలిసిందే. మొదట్లో రహస్యంగా కలిసే.. ఈ జంట ఆ తర్వాత ఓపెన్ అయిపోయింది. విదేశీ టూర్ లు .. లోకల్ గా షికారు చేస్తూ హ్యాపీగానే గడుపుతున్నారు. అయితే అర్జున్ కపూర్ ఆర్ఠిక కష్టాల్లో ఉన్నారనే ఓ న్యూస్ బయటికొచ్చింది.

 ఇటీవల అర్జున్ క‌పూర్ త‌న ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్ ను అమ్మేశాడు. ప‌ద‌హారు కోట్ల రూపాయ‌ల వ్య‌యానికి త‌న ఫ్లాట్ ను అమ్మేశాడు. ఇది న‌ష్టానికి అమ్ముకున్నాడ‌ట. గ‌త ఏడాదే ఈ ఫ్లాట్ ను అర్జున్ క‌పూర్ కొనుగోలు చేశాడు. అప్ప‌ట్లో ఇర‌వై కోట్ల రూపాయ‌ల ధ‌ర‌కు అర్జున్ క‌పూర్ ఈ ఫ్లాట్ ను కొన్నాడు. అయితే ఇప్పుడు అమ్మింది మాత్రం కేవ‌లం 16 కోట్ల రూపాయ‌ల‌కే తీసేశాడు. అవసరం అలాంటిది అంటున్నారు. పెళ్లి కాకున్నా.. సంసారం.. పిల్లలు  ఉన్నారు. ఆ మాత్రం ఖర్చులు ఉండవా ? అంటూ ఈ న్యూస్ విన్న నెటిజన్లు సటైర్లు వేస్తున్నారు.