నేడే జాతీయ అవార్డుల ప్ర‌క‌ట‌న

68వ జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డుల ప్ర‌క‌ట‌న ఈరోజు సాయింత్రం వెలువ‌డ‌నుంది. ఈసారి టాలీవుడ్ ఆశగా చూస్తోంది. 2021లో తెలుగులోనూ మంచి సినిమాలొచ్చాయి. ఆర్‌.ఆర్‌.ఆర్, పుష్ప గట్టి పోటీ ఇవ్వనున్నాయి. జాతిర‌త్నాలు, శ్రీ‌కారం, నాంది, సినిమా బండి… ఇలా కొన్ని చిన్న సినిమాలు అవార్డు రేసులో ఉన్నాయి. ప్రాంతీయ ఉత్త‌మ చిత్రంగా వీటిలో ఏదైనా నిల‌వొచ్చు. 

 గ‌తేడాది అద్భుతమైన విజ‌యం సాధించిన జై భీమ్‌ పేరు ఈసారి అవార్డుల జాబితాలో గట్టిగా వినిపించే ఛాన్సుంది. కాక‌పోతే.. అది త‌మిళ సినిమా. ఎప్ప‌టిలానే ఈసారి మ‌ల‌యాళం చిత్ర‌సీమ ఎక్కువ అవార్డుల్ని ఎగ‌రేసుకొని వెళ్లే ఛాన్సుంది. ఈ అవార్డుల్లో ప్ర‌తీసారీ.. తెలుగు సినిమాకి మొండి చేయి చూపించ‌డం మామూలే. మరీ సారైనా తెలుగు వెలుగిపోతుందేమో చూడాలి.