జపాన్ లో RRR ఎప్పటి నుంచి అంటే?

ఆర్ఆర్ఆర్ జపాన్ రిలీజ్ అప్ డేట్ వచ్చేసింది. ఈ ఏడాది అక్టోబరు 21న జపాన్ ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తున్నందుకు ఆనందంగా ఉందని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఇంతకుముందు.. ‘ముత్తు’, ‘బాద్‌ షా’, ‘రోబో’, ‘మగధీర’, ‘బాహుబలి’, ‘సాహో’, ‘3 ఇడియట్స్‌’, ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్’ తదితర భారతీయ సినిమాలు జపనీస్‌లో డబ్ అయి జపాన్‌ ప్రేక్షకుల్ని మెప్పించాయి.

తొలితరం స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాల్లోని ఓ ఉమ్మడి పాయింట్ ఆధారంగా రాజమౌళీ ఈ కథని తెరకెక్కించారు. అల్లూరిగా రామ్ చరణ్, ఆయనకు జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించారు. కొమరం భీమ్ గా ఎన్ టీఆర్, ఆయనకు జంటగా హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరీస్ నటించారు. అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఎం.ఎం కీరవాణి సంగీతం. డివివి దానయ్య నిర్మించారు. 

#RRRinJapan #RRRMovie is releasing in Japan on 21st Oct, 2022.@ssrajamouli @RRRMovie @tarak9999 @AlwaysRamCharan #RRR @aliaa08 pic.twitter.com/Fo87Omk5PO— OTTRelease (@ott_release) July 21, 2022