షూటింగ్స్ బంద్.. రేపే తుది నిర్ణయం !

ఓటీటీల ప్రభావం, నిర్మాణ వ్యయం, సినిమా టికెట్‌ ధరలు.. తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని కొందరు నిర్మాతలు ఆగస్టు 1 నుంచి షూటింగ్‌లు నిలిపివేయాలని భావించిన సంగతి తెలిసిందే. దీనిపై గురువారం నిర్మాతలు మరోసారి సమావేశం అయ్యారు. ప్రస్తుతం సెట్స్ పైన ఉన్న సినిమాలను నిలిపివేయాలా ? లేక కొత్తగా ప్రారంభం కాబోతున్న సినిమాలను ఆపాలనే విషయంపై చర్చ జరిగినట్టు తెలిసింది.

రేపు (శనివారం) ఫిల్మ్ ఛాంబర్ లో నిర్మాతలు మరోసారి సమావేశం కానున్నారు. ఈ మీటింగ్ లో ఫైనల్ డిసిషన్ తీసుకుంటామని సీనియర్ నిర్మాత సి కళ్యాణ్ తెలిపారు. కొత్త సినిమాల నిర్మాణాన్ని ఆపే ఉద్దేశం తమకు లేదన్నారు. 23న జరిగే మీటింగ్‌లో అన్నికోణాల్లో చర్చి నిర్ణయం తీసుకుంటాం అన్నారు. మరోవైపు ఓటీటీ రిలీజ్ పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. థియేటర్లలో రిలీజైన సినిమా 75 రోజుల తర్వాత ఓటీటీలకి ఇవ్వాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అలా అయితే డైరెక్ట్ గా ఓటీటీలోకి వెళ్లే సినిమాల సంఖ్య పెరుగుతుందని మరికొందరు అంటున్నారు. మొత్తానికి.. టాలీవుడ్ లో ఓ రకమైన ప్రక్షాళన అయితే మొదలైనట్టు కనబడుతున్నది.