TSలో మరో 13 కొత్త మండలాలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా మరో పదమూడు మండలాలను ప్రకటించారు. ఇవన్నీ ప్రజల్లో కొంత కాలంగా ఉన్న డిమాండ్లే. గతంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినప్పుడు అనేక మండలాలను కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి డిమాండ్లు వచ్చాయి. వీటన్నింటినీ పరిశీలించిన ప్రభుత్వం తాజాగా పదమూడు మండలాలను ఏర్పాటు చేస్తూ నిర్ణయంతీసుకుంది కేసీఆర్ సర్కార్.
ఇప్పుడు మొత్తం తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. ఇలా వరుసగా ఎక్కడైనా మండలాల డిమాండ్ వస్తే తీర్చేందుకు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఎన్నికలకు చాలా పకడ్బందీగా ప్రణాళిక సిద్ధం చేస్తున్న కేసీఆర్ ఇలాంటి విషయంలో మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. మరిన్ని మండలాల డిమాండ్లు ఉన్న పరిష్కరించేందుకు రెడీగా ఉంటారు.