బిగ్ బీ ఇంట్లో రష్మిక

హీరోయిన్ రష్మిక మందన బాలీవుడ్ లో మూడు సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. మిషన్ మజ్ను, గుడ్ బై, యానిమల్ సినిమా చేస్తోంది. వాస్తవానికి గుడ్ బై ఆమె బాలీవుడ్ సినిమా. ఈ సినిమా సంతకం చేసిన తర్వాత మిగితా రెండు సినిమాల్లో అవకాశం దక్కింది. అంతేకాదు.. తొలి సినిమాతోనే బిగ్ బీ అమితాబ్ తో కలిసి నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది రస్మిక. ‘గుడ్ బై’లో అమితాబ్ కీలక పాత్రలో నటించారు.

ఇదో కామెడీ డ్రామా. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు తెలిపారు ఈ మేరకు రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ఒకటి వదిలారు. ఇందులో అమితాబ్, రష్మిక.. తదితరులు టీవీ చూస్తూ ఫ్యామిలీ టైమ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పోస్టర్ చూస్తుంటే బిగ్ బీ ఇంట్లో రష్మిక సరదా గడిపుతున్నట్టు ఉంది. అంతా నేచురల్ గా పోస్టర్ ను డిజైన్ చేశారు. సినిమా కూడా ఇలాగే ఉంటే సూపర్ హిట్ అవ్వడం ఖాయం. ఈ చిత్రానికి కాస్ బహల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏక్తా కపూర్ నిర్మాత.

మ‌రోవైపు తెలుగులో పుష్ప‌-2 షూటింగ్‌ను త్వ‌ర‌లో మొద‌లుపెట్ట‌బోతున్న‌ది ర‌ష్మిక మంద‌న్న‌. పుష్ప తొలి భాగంలో శ్రీవ‌ల్లిగా డీగ్లామ‌ర్ పాత్ర‌తో ఆక‌ట్టుకున్న‌ది. సెకండ్ పార్ట్ లో రష్మిక క్యారెక్ట‌ర్ ఎలా ఉండ‌బోతుందోన‌ని అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. పుష2తో పాటు వారసుడు, సీతా రామం సినిమాల్లోనూ రష్మిక నటిస్తున్నారు.