బరివాతల ట్రెండ్.. కంటిన్యూ

బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ సరికొత్త ట్రెండ్ తీసుకొచ్చారు. బరివాతల ట్రెండ్ సెట్టర్ గా మారాడు. ఈ స్టార్ హీరో ఓ మేగజైన్ కవర్ పేజీ కోసం బట్టలన్నీ విప్పేసి బరివాతల కనిపించిన సంగతి తెలిసిందే. వివిధ భంగిమల్లో న్యూడ్ గా దర్శనమిచ్చాడు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రణ్ వీర్ నగ్నత్వంపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది.

మరోవైపు, రణ్ వీర్ ను ఆదర్శంగా తీసుకున్న తమిళ నటుడు విష్ణు విశాల్ బట్టలన్నీ విప్పేశాడు. న్యూడ్ గా కనిపించాడు. బెడ్ మీద పడుకొని సెమీ న్యూడ్ షో చేశారు. దీంతో రణ్ వీర్, విష్ణు విశాల్ ఫోటోలు పక్కపక్కన పెట్టేసి.. బరివాతల కొత్త ట్రెండ్ అంటూ నెటిజన్స్ వైరల్ చేస్తున్నారు. రణ్ వీర్ సింగ్ బరివాతల షోలో కెమెరా ట్రిక్ ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ విష్ణు విశాల్ నేచరుల్ షో చేశారు. మొత్తానికి.. మగాళ్లకు మంచి రోజులు వచ్చేశాయి. మొత్తం విప్పేసుకొని అందాలు ఆరబోయొచ్చు అన్నమాట !

రణ్ వీర్, విష్ణు విశాల్ కంటే ముందు రౌడీ హీరో విజయ్ దేవరకొండ నగ్న ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. లైగర్ ఫస్ట్ లుక్ లో భాగంగా.. కేవలం రోజ్ పూలను అక్కడ అడ్దం పెట్టుకొని బరివాతల కనిపించాడు విజయ్. ఆ కొద్దిరోజులకే రణ్ వీర్ పూర్తిగా బరివాతల కనిపించడంతో.. ఇది ట్రెండ్ గా మారింది. వీరిని ఆదర్శంగా తీసుకొని… వీళ్ల అభిమానులు ఇదే పని చేస్తే పరిస్థితి ఏంటన్నది అర్థం కావడం లేదు.