ఆఖరి షెడ్యూల్ కు రెండో కేసు

HIT 2 బిగ్ అప్ డేట్ వచ్చేసింది. అడవి శేష్ – మీనాక్షి చౌదరి జంటగా ‘హిట్ : ది సెకండ్ కేసు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా అప్ డేట్ ఇస్తూ.. ఓ ప్రెస్ నోట్ లాంటిది విడుదల చేశారు అడవి శేష్. వచ్చే నెల నుంచి ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ ఉంటుందని తెలిపారు. 

తెలుగు తెరపై మొదటి కేసు సూపర్ హిట్టైన విషయం తెలిసిందే. 2020లో వచ్చిన ‘హిట్’ సూపర్ హిట్టయింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో విశ్వక్ సేన్ – రుహాని శర్మ జంటగా నటించారు. ఈ సినిమాతో శైలేష్ కొలను దర్శకుడిగా పరిచయం అయ్యారు. ప్రశాంతి తిపిర్నేని కలిసి నాని నిర్మించారు. రెండో కేసును అడవిశేష్ డీల్ చేస్తున్నారు. హిట్ 2 జులై 29న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే మేజర్ రిలీజ్ పనులు… ఆ తర్వాత ప్రమోషన్స్ లో శేష్ బిజీగా ఉండటంతో హిట్ 2 ఆలస్యం అయింది. ఇప్పటికే ప్రకటించిన రిలీజ్ డేట్ దగ్గరపడటంతో.. సినిమా అప్ డేట్ ఇస్తూ.. ఓ నోట్ వదిలారు శేషు.