5G డేంజర్ ? అసలు నిజాలు ఏంటంటే ?

ఇప్పటికే అనేక దేశాల్లో 5జీ నెట్‌వర్క్‌లు (5G) ప్రారంభం అయ్యాయి. త్వరలోనే మన దేశంలోనే 5జీ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ నెల 26న 5జీ స్పెక్ట్రమ్‌ వేలం జరగనుంది. ఈ ఏడాది చివరికల్లా దేశంలోని 13 ప్రధాన నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ లిస్టులో మన హైదరాబాద్ కూడా ఉంది.

అయితే 5జీ సాంకేతికతకు సంబంధించి ఇప్పటికే ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. దీనివల్ల వెలువడే రేడియో ధార్మికత మానవులు, పశుపక్ష్యాదుల ఆరోగ్యానికి హానికరమన్న ప్రచారం జరుగుతోంది. ఇందులో ఏ మాత్రం నిజం లేదు. గతంలో పరిశోధనలు ప్రధానంగా ఎలుకలపై పరిశోధనలు జరిపారు.

5జీతో సహా అన్ని మొబైల్‌ నెట్‌వర్కుల ద్వారా వెలువడే రేడియేషన్‌.. సూర్యకాంతితో ఏర్పడే రేడియేషన్‌ కన్నా తక్కువ శక్తిమంతమైనది. ఈ నెట్‌వర్కులతో పోలిస్తే ఎక్స్‌రే యంత్రాలు, స్కానర్లు ఎక్కువ శక్తిమంతమైన రేడియేషన్‌ను వెలువరిస్తాయి. 5జీ వల్ల మానవ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఏ పరిశోధనలోనూ తిరుగులేకుండా నిర్ధారణ కాలేదు. ఈ నేపథ్యంలో 5జీ పై ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.