ఐ లైక్ సాఫ్టీస్

ఐ లైక్ సాఫ్టిస్ అంటోంది బుట్టబొమ్మ. బుడ్డ పిల్లకు ఐస్ క్రీమ్ కొనిస్తే ఎంత సంతోషపడుతుందో..! అలాంటి ఆనందమే బుట్టబొమ్మ పూజా హెగ్డేలోనూ కనిపించింది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఫారిన్ లో ఉంది. అక్కడ ఓ ఐస్ క్రీమ్ కొనుక్కొని.. దాన్ని ఆస్వాదిస్తున్న పిక్ ఒకటి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఐ లైక్ సాఫ్టీస్.. అంటూ కామెంట్ పెట్టింది.

ఐస్ క్రీమ్ పాపకు నెటిజన్లు లైకులు కొడుతున్నారు. టాలీవుడ్, కోలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ రేంజ్ అనుభవిస్తోంది పూజా వరుసగా స్టార్ హీరోలతో రొమాన్స్ చేస్తోంది. మరోవైపు బాలీవుడ్ లోనూ హవా కొనసాగిస్తోంది. అక్కడ సూపర్ స్టార్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది. ఇంకోవైపు పాన్ ఇండియా సినిమాలకు పర్ ఫెక్ట్ ఆప్షన్ గా మారింది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘జనగణమన’తో పాటుగా సర్కస్, కభీ ఈద్ కభీ దివాళీ సినిమాల్లో నటిస్తోంది. ఇక మహేష్-త్రివిక్రమ్, హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరోయిన్ గా ఎంపికైంది. మహేష్ సినిమా ఆగస్టు నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. పవన్- హరీష్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడన్నది మాత్రం ప్రస్తుతానికి క్లారిటీ లేని విషయం. పవన్ పొలిటిక్స్ పై ఫోకస్ పెట్టారు. త్వరలో బస్సు యాత్ర అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికి స్టార్ట్ చేయని సినిమాలను క్యాన్సిల్ చేసుకున్న ఆశ్చర్యపోవాల్సిన పనిలేదేమో.. !