యష్ సింప్లిసిటీ.. ఫ్యాన్స్ ఫిదా !

స్టార్ హీరో వచ్చి రోడ్డు పక్కన షాప్ లో ఫ్రూట్స్ కొనుక్కుంటే ఎలా ఉంటుంది ?  ఇప్పుడు కేజీఎఫ్ హీరో యష్ అదే పని చేశాడు. కాకపోతే.. అది బెంగళూరులో కాదు ఫారిన్ లో. ప్ర‌స్తుతం కుటుంబంతో క‌లిసి యూర‌ప్ టూర్‌లో ఉన్నాడు య‌శ్‌. విదేశాల్లో కేజీఎఫ్ స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ టూర్‌కు సంబంధించి ఇటీవల య‌శ్ వైఫ్ రాధిక పండిట్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలు అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి.

తాజాగా శ‌నివారం య‌శ్ ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇందులో భార్య రాధిక పండిట్‌తో క‌లిసి రోడ్డు ప‌క్క‌న ఉన్న షాపులో ఫ్రూట్స్ కొంటూ య‌శ్ క‌నిపించాడు. సింపుల్ జాయ్స్ ఆఫ్ లైఫ్ అంటూ ఈ ఫొటోకు క్యాప్ష‌న్ జోడించారు. అత‌డి సింప్లిసిటీకి అభిమానులు ఫిదా అవుతున్నారు.

కేజీఎఫ్ సిరీస్‌ తో యష్ పాన్ ఇండియ‌న్ స్టార్ గా మారిపోయాడు.  రాఖీభాయ్ పాత్ర‌లో అత‌డి ఆటిట్యూడ్‌,యాక్టింగ్ స్టైల్ భాషాభేదాల‌కు అతీతంగా సినీ అభిమానులందరిని మెప్పించింది. కేజీఎఫ్‌-2 ఇండియాలోనే అత్య‌ధిక వ‌సూళ్ల‌ను సాధించిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. బాలీవుడ్‌, టాలీవుడ్‌, క‌న్న‌డంతో పాటు ప్ర‌తి భాష‌లో స్ట్రెయిట్ సినిమాల‌కు మించి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిరికార్డుల‌ను తిర‌గ‌రాసింది. కేజీఎఫ్‌-2 త‌ర్వాత య‌శ్ చేయ‌బోయే సినిమా కోసం అన్ని భాష‌ల ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రాబోతున్న‌ట్లు స‌మాచారం. ఈ చిత్రానికి గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తారని సమాచారం.