ది గ్రే మ్యాన్‌ : ధనుష్ నటన ఎలా ఉందంటే ?

అవెంజర్స్‌: ది ఎండ్‌ గేమ్‌ వంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించిన రస్సో బ్రదర్స్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ది గ్రే మ్యాన్‌’. మార్క్‌ గ్రీని రాసిన నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ధనుష్‌ ఇందులో కీలక పాత్ర పోషించారు. రస్సో బ్రదర్స్‌ అనగానే మనకు గుర్తొచ్చే చిత్రాలు అవెంజర్స్‌ సిరీస్‌. కళ్లు చెదిరే గ్రాఫిక్స్‌, మంత్రముగ్ధులను చేసే విజువల్‌ ఎఫెక్ట్స్‌తో చిత్రాలను తెరకెక్కించిన వారు.. ఆ జానర్‌ నుంచి పూర్తిగా బయటకు వచ్చి తెరకెక్కించిన చిత్రమిది. ఒక రొటీన్‌ కథకు యాక్షన్‌ అనే మసాలా జోడించి ‘ది గ్రే మ్యాన్‌’ తీసుకొచ్చారు.

ఇక ఈ సినిమాలో ధనుష్‌ విలన్‌ పంపే కిరాయి హంతకుల్లో ఒకరిగా నటించారు. ఆయన ఉన్నంతసేపూ యాక్షన్‌ సీన్స్‌ వైల్డ్‌గా, మరింత బాగుంటాయి. టెక్నికల్ గా సినిమా బాగుంది. హెన్రీ జాక్‌మెన్‌ నేపథ్య సంగీతం యాక్షన్‌ సన్నివేశాలను ఎలివేట్‌ చేసింది. స్టీఫెన్‌ సినిమాటోగ్రఫీ, జెఫ్రీగ్రోత్‌, పైట్రోస్కాలియా ఎడిటింగ్‌ బాగుంది. ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’లాంటి భారీ చిత్రాన్ని తీసిన రస్సో బ్రదర్స్‌ ‘ది గ్రే మ్యాన్‌’ను మాత్రం సాధారణ యాక్షన్‌ ఫిల్మ్‌గా తీర్చిదిద్దారంతే. యాక్షన్‌కు ఎమోషన్ జోడించి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది.