నెట్ ఫ్లిక్స్ లో లాల్‌సింగ్ చ‌డ్డా

ఆమిర్‌ఖాన్ హీరోగా న‌టించిన లాల్‌సింగ్‌చ‌డ్డా ఆగ‌స్ట్ 11న ప్రేక్ష‌కుల ముందుకురానుంది. బాలీవుడ్‌తో పాటు తెలుగు, త‌మిళ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఒకే రోజు ఈ సినిమా రిలీజ్‌కానుంది. ఈ సినిమా తెలుగు వెర్ష‌న్‌కు అగ్ర హీరో చిరంజీవి ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ ఆధారంగా లాల్‌సింగ్‌చ‌డ్డా రూపొందుతోంది. ఈ హిస్టారిక‌ల్ డ్రామా సినిమాతో టాలీవుడ్ యువ హీరో నాగ‌చైత‌న్య బాలీవుడ్‌లో అరంగేట్రం చేయ‌బోతున్నారు. ఆమిర్‌ఖాన్ స్నేహితుడిగా కీల‌క‌మైన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. లాల్‌సింగ్‌చ‌డ్డాలో క‌రీనాక‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కి ముందే ఓటీటీ రిలీజ్ విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను  నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకొంది.