మార్వెల్ మూవీస్/వెబ్ సిరీస్ రిలీజ్ డేట్స్

రాబోయే మూడేళ్లలో తమ సంస్థ నుండి రానున్న పలు సినిమాలు, వెబ్ సిరీస్ ల రిలీజ్ డేట్స్ ను మార్వెల్ స్టూడియోస్ ప్రకటించింది. అవెంజ‌ర్స్ సిరీస్‌లో భాగంగా అవెంజ‌ర్స్ సీక్రెట్ వార్ అనే సినిమాను తెర‌కెక్కిస్తోంది. ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ 7 2025లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించింది.

అలాగే అవెంజ‌ర్స్ ది కాంగ్ ఆఫ్ డెస్టినీ సినిమాను మే 2 2025 ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు పేర్కొన్నారు. ఫెంటాస్టిక్ ఫోర్ చిత్రాన్ని న‌వంబ‌ర్ 8 2024లో రిలీజ్ చేయ‌నున్న‌ట్లు పేర్కొన్న‌ది. బ్లాక్‌పాంథ‌ర్ సినిమాకు వ‌కాండా ఫ‌రెవ‌ర్ పేరుతో సీక్వెల్ రూపొందిస్తోంది. నవంబ‌ర్ 11 2022లో ఈ సూపర్ హీరో సినిమాను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ సీక్వెల్ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేసింది.

థండ‌ర్‌బోల్ట్స్ ను జూలై 26 2024 విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చెప్పింది.కెప్టెన్ అమెరికా న్యూ వ‌ర‌ల్డ్ ఆర్డ‌ర్ సినిమా మే 2 2024 లో రిలీజ్ కానుంది. బ్లేడ్ చిత్రాన్ని న‌వంబ‌ర్ 3 2023 లో విడుద‌ల‌చేయ‌బోతున్నారు. గార్డియ‌న్ ఆఫ్ గెలాక్సీ సినిమాను మే 5 2023 ప్రేక్ష‌కుల ముందుకు తీసుకున్నారు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ రిలీజ్ డేట్స్ ను వెల్లడించింది. డెవిల్ బోర్న్ అగైన్ సిరీస్ 2024లో స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్లు మార్వెల్ స్టూడియోస్ ప్ర‌క‌టించింది.