NBK107.. కొండారెడ్డి బురుజు

ప్ర‌స్తుతం బాల‌కృష్ణ హీరోగా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ సినిమా తెర‌కెక్కుతోంది. ఇందులో బాల‌కృష్ణ సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌తో పాటు యువ‌కుడిగా డ్యూయ‌ల్ షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్నారు. ప్ర‌స్తుతం క‌ర్నూల్‌లో ఈసినిమా షూటింగ్ జ‌రుగుతున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

కొండారెడ్డి బురుజుతో పాటు మౌర్య హోట‌ల్ సెంట‌ర్‌లో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్న‌ట్లు పేర్కొంది. ఈ మేర‌కు బాల‌కృష్ణ ప‌వ‌ర్ ఫుల్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో వైట్ డ్రెస్‌లో క‌త్తి ప‌ట్టుకొని రౌద్రంగా బాల‌కృష్ణ క‌నిపిస్తున్నారు. ఈ పోస్ట‌ర్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. బాల‌కృష్ణ‌కు జోడీగా శృతిహాస‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది.