కన్ఫూజన్ లేదు.. క్లారిటీ ఉంది

తనకు ఎలాంటి కన్ఫూజన్ లేదు. ఫుల్ క్లారిటీ ఉంది అంటున్నారు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన త్వరలో బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. అది నిజమే అన్నట్టుగా తెలంగాణలో బీజేపీ బాగా బలపడింది. సీఎం కేసీఆర్ ను ఎదుర్కొనే దమ్ము ఆ పార్టీకే ఉందని అంటున్నారు. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయింది. ఉద్యమకారులకు పార్టీలో ప్రాధాన్యత లేదు. ఇతర పార్టీల నుంచి వస్తున్న వారికి పెద్దపీట వేస్తున్నారని అంటున్నారు.

రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నట్టు వార్తల నేపథ్యంలో సోమవారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోమటిరెడ్డి ఇంటికి వెళ్లి కలిశారు. చాలా సేపు వీరి సమావేశం జరిగింది. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి.. తనకు కన్ఫూజన్ లేదు. క్లారిటీ ఉంది. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అన్నారు. ఇక మునుగోడులో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణి చేసేందుకు మంత్రి జగదీశ్వర్ రెడ్డి రావాల్సిన అవసరం ఏముంది ? అని ప్రశ్నించారు. ఇక భట్టి మీడియాతో మాట్లాడుతూ.. తాను చెప్పాల్సింది చెప్పా. తనవంతు ప్రయత్నం చేశా. ఏం జరుగుతుందో చూద్దాం అన్న ధోరణిలో మాట్లాడారు.

సోమవారం జరిగిన ఏపీసోడ్ తో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారన్న విషయంలో మరింత క్లారిటీ వచ్చినట్టు కనిపిస్తుంది. అది అదెప్పుడు ? అన్నది తెలియాల్సి ఉంది. బహుశా.. శ్రావణమాసం ప్రారంభం కాగానే ఆయన కమల తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి.