14 మంది అమ్మాయిలతో ‘లైగర్’.. ఇంకేమైనా ఉందా ?

పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కిన తొలి పాన్ ఇండియా సినిమా ‘లైగర్’. ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ సినిమాలో చాలా సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇందులో ఒకటి 14 మంది అమ్మాయిలతో రౌడీ విజయ్ చేసే ఫైట్ అట.

పద్నాలుగుమంది అమ్మాయిలూ మార్షల్ ఆర్ట్స్‌లో నిపుణులే. వాళ్లని పూరి ఫారెన్ నుంచి తీసుకొచ్చాడు. ఈ ఫైట్ కే భారీ మొత్తం ఖర్చు చేయాల్సివచ్చిందట. ప్రీ క్లైమాక్స్‌కి ముందు వచ్చే ఈ ఫైట్… థియేటర్లో ఓ బ్లాస్ట్ లా పేలబోతోందని టాక్. ఇక మైక్ టైసన్ తో ఫైట్ క్లైమాక్స్ లో వస్తుందట. ఆ ఫైట్ కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో రూందించారని తెలుస్తోంది. ఇవి కాకుండా ఈ సినిమాలో ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. వాటిని చిత్రబృందం ఒకొక్కటిగా రివీల్ చేయాలని భావిస్తోంది.