పాలక్ ముచ్చల్.. స్టైల్, మనసు సూపర్ !

హీరోయిన్లకు మంచి అందమే కాదు. మంచి మనసు ఉంటుందని నిరూపించింది ఇండోర్ (మధ్యప్రదేష్) బ్యూటీ పాలక్ ముచ్చల్. దామడమ్ సినిమాతో బాలీవుడ్ కు పరిచయం అయింది. దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించింది. హిందీ పాటలతో పాటు తెలుగు, కన్నడ, బోజ్ పురి, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, ఉర్దూ పాటలు పాడింది. ఈ ఏడాది అర్ధ్, రాష్ట్ర కవచ ఓం సినిమాల్లో నటించింది పాలక్. పాలక్ మంచి సింగర్ కూడా. ఇప్పటికే చాలా పాటలు పాడింది. అందులో కొన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి.

పాలక్ ముచ్చల్ మంచి అందగత్తె. అంతకుమించి మంచి మనసు ఆమె సొంతం. విరాళాలు సేకరించి హార్ట్ డిసీస్ తో బాధపడుతున్న 2200 మంది చిన్నారులకు చికిత్స చేయించింది. తద్వారా గిన్నీస్ బుక్, లిమ్కా వరల్డ్ రికార్డులు నమోదు చేసింది. అందుకే పాలక్ ముచ్చల్ అంటే.. ప్రత్యేక అభిమానం చూపిస్తుంటారు అభిమానులు. ప్రేక్షకులకు మాత్రమే కాదు. సినిమా వాళ్లకు ముచ్చల్ అంటే మస్త్ లైకు.