గర్ల్ ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో సల్మాన్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గర్ల్ ఫ్రెండ్, రొమేనియన్ సింగర్ లూలియా జూలై 24న 42వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఆదివారం తన పుట్టినరోజును వేడుకను ఘనంగా జరుపుకుంది. ఈ వేడుకకు సుల్తాన్ , అతని తమ్ముడు సోహైల్ ఖాన్, బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ నికేతన్ మధోక్ తదితరులు హాజరయ్యారు.

సల్మాన్‌, లూలియా వంటూర్ చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. లూలియా ‘మైన్ చలా’ పాట కోసం గాయకుడు గురు రంధవాతో కలిసి పనిచేసింది. ఇందులో ప్రగ్యా జైస్వాల్‌తో కలిసి సల్మాన్ ఖాన్ కనిపించారు. సల్మాన్ తదుపరి సాజిద్ నడియాడ్‌వాలా ‘కభీ ఈద్ కభీ దివాలీ’లో పూజా హెగ్డేతో కలిసి నటించనున్నారు. ఇది డిసెంబర్ 30, 2022న విడుదల కానుంది.