‘సీతా రామం’ ట్రైలర్‌ టాక్

దుల్కర్‌ సల్మాన్ , మృణాల్‌ ఠాకూర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా సీతా రామం. ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం చిత్రబృందం విడుదల చేసింది. ’20 ఏళ్ల క్రితం లెఫ్టినెంట్‌ రామ్‌ నాకొక బాధ్యత అప్పగించాడు. ఈ ఉత్తరం సీతామహాలక్ష్మికి నువ్వే చేర్చాలి’ అని సంభాషణలతో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం హృదయాన్ని హత్తుకునేలా సాగింది.

1965 నాటి కాలంలో సాగే కథతో ఈ హను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రష్మిక, సుమంత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌, స్వప్న సినిమాస్‌ ‘సీతారామం’ను నిర్మిస్తున్నాయి. విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీత దర్శకుడు.