సోనాక్షి సిన్హా బీచ్ లుక్.. వైరల్

బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఏ విషయంలోనైనా చాలా ఫాస్ట్. ‘దబాంగ్’ (2010) సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సోనాక్షి. ఆ వెంటనే బిజీ అయిపోయింది. ఏడాదికి ఐదారు సినిమాలు చేసింది. చాలా ఫాస్ట్ గా స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది. 2019 వరకు ఆమె హవా కొనసాగింది. కరోనా విజృంభణ తర్వాత అంటే.. 2020లో ఆమె నెమ్మదించింది. ఏడాదికి ఒక సినిమా చేస్తోందంతే. అదే సమయంలో ఈ ముద్దుగుమ్మ మనసు ప్రేమ వైపు మళ్లింది.

నటుడు జహీర్ ఇక్బాల్ తో పీకలోతు ప్రేమలో ఉంది. కొన్నాళ్లుగా ఈ జంట ప్రేమను ఆస్వాదిస్తున్నారు. ఇటీవల వీరికి ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. బహుశా.. శ్రావణంలో ఈ జంట పెళ్లి భోజం పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కత్రినా, అలియా పెళ్లి చేసుకున్నారు. దీంతో సోనాక్షి సైతం ఓ ఇల్లాలు కావాలని ఆశపడింది. ప్రియుడినితో నిశ్చార్థం పూర్తి చేసుకొంది. త్వరలో మెడలో మూడు ముళ్లు వేయించుకోనుంది