హైదరాబాద్ లో #RC15 షూటింగ్

గ్రేట్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా (#RC15) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. విక్టోరియా మెమోరియల్‌ హోమ్‌లో ఈ సినిమా షూట్‌ చేస్తున్నారు.

తాజా షెడ్యూల్ లో హీరోయిన్ కియారా అద్వానీ జాయిన్ అయిందా ? లేదా ? అన్నది తెలియదు. కానీ, రామ్ చరణ్ షూటింగ్ లో పాల్గొన్నారు. ఓ మేడపై వేసిన చిన్న టెంట్ లోకి ఆయన వెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
ఈ సినిమాకు సంబంధించిన రామ్ చరణ్ లుక్ ఇటీవల బయటికొచ్చిన సంగతి తెలిసిందే. అది పూర్తి స్థాయిలో కాదు. హెయిర్ స్టైల్ చూపించారు. గ్యాంగ్ లీడర్ లో మెగాస్టార్ చిరంజీవిని తలపించింది.

ఈ సినిమా కోసం సిటిజన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అంతేకాదు ఈ సినిమాలో రామ్‌చరణ్‌ డ్యుయల్‌ రోల్‌లో నటించనున్నట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికే అమృత్‌సర్‌, వైజాగ్‌లలో షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఆర్సీ 15 ప్రస్తుతం హైదరాబాద్‌ షెడ్యూల్‌లో ఉంది.

New leaked ….. video anna look kcpd…..🔥 Edo gattigane plan chesadu Shankar mama….🥳
Sorry for leak ……but cheyyalsivachindi….@AlwaysRamCharan #rc15 #ManOfMassesRamCharan pic.twitter.com/Edlk5MtfmZ— Lohith ….RC….🔥 (@LDamarasingh) July 25, 2022