ధనుష్ ‘సార్’ బర్త్ డే బహుమతులు

కోలీవుడ్ స్టార్ ధనుష్ పుట్టిన రోజు రేపు. అయితే ఒకరోజు ముందుగానే ఆయన నుంచి బహుమతులు క్యూ కడుతున్నాయి. బుధవారం ఉదయమే ‘సార్’ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. క ఈ సాయంత్రం టీజర్ ను విడుదల చేయనున్నారు. మరోవైపు ధనుష్ బర్త్ డే కానుకగా హాలీవుడ్ గిఫ్ట్ కూడా అందింది.

ఇటీవలే హాలీవుడ్‌లోనూ ది గ్రే మ్యాన్ చిత్రంతో రంగం ప్రవేశం చేసి తానేంటో నిరూపించుకున్నారు. ధనుష్ బర్త్ డే కానుకగా’ది గ్రే మ్యాన్’ సంబంధించిన మేకింగ్ వీడియో ఒకటి విడుదల చేశారు. ఇందులో ధనుష్ యాక్షన్ ను చూపించారు. అంతేకాదు.. సినిమా మొదటి రోజు షూటింగ్ లో జాయిన్ అయిన సీన్ ను చూపించారు. వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటూ కెరీర్ పరంగా దూసుకెళ్తున్న ధనుష్ కు టీఎస్ మిర్చి డాట్ కామ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది. సార్ తర్వాత ఆయన మరిన్ని తెలుగు సినిమాలు చేయాలని కోరుకుంటోంది.

Here’s a glimpse of @dhanushkraja
behind the scenes of #TheGrayMan.#Dhanush #TheGrayManNetflix #Dhanushkraja #ottrelease pic.twitter.com/6OUnEkIVFC— OTTRelease (@ott_release) July 27, 2022