సల్మాన్ కనిపిస్తే అంతే

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కనిపిస్తే.. పులకరించిపోయే ముద్దుగుమ్మల లిస్ట్ పెద్దదే. ఈ జాబితాలో శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఒకరు. ముంబైలో జరిగిన ‘విక్రాంత్ రోనా’ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన సల్మాన్ పై ప్రేమను మరోసారి ఒలకబోసింది ఈ బ్యూటీ.  కిచ్చా సుదీప్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లు సల్మాన్ కు ఘనస్వాగతం పలికారు. సుదీప్, జాక్వెలిన్‌తో కలిసి ‘పెప్పీ రక్కమ్మ.. ‘ పాటకు సల్మాన్ డ్యాన్స్ చేశాడు. పూల చీరలో జాక్వెలిన్ ఒంపుసొంపులు ఆకట్టుకున్నాయి.

సల్మాన్ తో జాక్వెలిన్ కు మంచి అనుబంధం ఉంది. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో జాక్వెలిన్ సల్మాన్ ఫామ్ హౌస్ లో వాలిపోయిన సంగతి తెలిసిందే. చాలా రోజులు అక్కడే గడిపింది. ఈ సమయంలో ఓ వీడియో సాంగ్ కూడా చేసారు. ఇక విక్రాంత్ రోనా విషయానికొస్తె.. అనూప్ బండారి దర్శకత్వంలో ఈ సినిమా  తెరకెక్కింది. ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ చిత్రం రేపే (జులై 28) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సల్మాన్ ‘దబాంగ్ 3’లో సుదీప్ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే.