‘పుష్ప 2’ స్క్రిప్ట్ పనుల్లో బుచ్చిబాబు

సుకుమార్ – అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన తొలి పాన్ ఇండియా సినిమా ‘పుష్ప’. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. త్వరలోనే పుష్ప 2 సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం సుకుమార్, ఆయన బృందం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.

ఉప్పెన దర్శకుడు, సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు కూడా పుష్ప 2 స్క్రిప్ట్ పనుల్లో జాయిన్ అయ్యారు. ఆయనతో సుక్కు డీప్ గా డిస్కస్ చేస్తున్న ఫోటో కూడా కనిపిస్తుంది. పుష్ప అంతకుమించి పుష్ప 2 ఉండేలా సుకుమార్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఎలివేషన్స్ సీన్స్ అదిరిపోయేలా ఉండేలా చూస్తున్నారట. సీక్వెల్ లో విజయ్ సేతుపతి కనిపిస్తారని సమాచారం. సెప్టెంబర్ నుంచి పుష్ప 2 రెగ్యులర్ షూట్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది.