ట్రెండీ లుక్ లో సంజనా సంఘీ
బాలీవుడ్ బ్యూటీ సంజనా సంఘీ ఫ్యాషన్ ప్రియురాలు. ‘రాక్ స్టార్’ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘దిల్ బేచారా’ తో పాపులర్ అయింది ఈ ఢిల్లీ బ్యూటీ. ఇందులో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు సరైన జోడీ అనిపించుకుంది. క్యాన్సర్ పేషెంట్ గా అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ సరికొత్త లుక్ లో కనిపించింది. లాంగ్ షర్ట్ ధరించి.. కింద పాయింట్ లేకుండా దర్శనమిచ్చింది. కూల్ గ్లాసెస్, చెవి రింగులు.. ట్రెండీ లుక్ లో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ Dhak Dhak సినిమాలో నటిస్తోంది. ఈ రోడ్ ట్రిప్ సినిమాకు తరుణ్ దూదే జా దర్శకత్వం వహిస్తున్నారు. రత్న పాఠక్ షా, ఫాతిమా సనా షేక్, దియా మీర్జా మరియు సంజనా సంఘీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వయాకామ్ 18 స్టూడియోస్‌తో కలిసి తాప్సీ నిర్మిస్తోంది.