సార్ ఫస్ట్ లుక్

కోలీవుడ్ హీరో ధనుష్ నటిస్తున్న సరికొత్త చిత్రం సార్. గురువారం (జులై 28) ధనుష్ పుట్టిన రోజు సందర్భంగా సార్ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. అంతేకాకుండా మరో అప్డేట్‌ను కూడా ఇచ్చారు. రేపు సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. వెంకీ అట్లూరీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేస్తోంది.
ఫస్ట్ లుక్ పోస్టర్ లో ధనుష్ గ్రంథాలయంలో ఏదో పుస్తకం చదువుతున్నట్లు తీక్షణంగా చూస్తుంటాడు. టేబుల్ లైటింగ్ ల్యాంప్ వెలుతురులో బుక్ రీడ్ చేస్తున్నట్లు ఉంది. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో సార్ తెరకెక్కుతోంది. ఇక వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటూ కెరీర్ పరంగా దూసుకెళ్తున్నారు ధనుష్. ఇటీవలే హాలీవుడ్‌లోనూ ‘ది గ్రే మ్యాన్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు.