బాలీవుడ్ లో మరో బ్రేకప్

బాలీవుడ్ నుంచి మరో బ్రేకప్ న్యూస్ వినిపిస్తోంది. దిశా పటానీ – టైగర్ ష్రాఫ్ చాన్నాళ్లుగా పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. తమ ప్రేమను బయటికి చెప్పకున్నా.. కలిసి తిరిగారు. సన్నిహితంగా మెలిగారు. పార్టీలు, పబ్ లు, ఫారిన్ టూర్ లు సాధారణమే. ఇక పటానీ స్పెషల్ ఫోటో షూట్ లకు తొలి కామెంట్ చేసే సినీ ప్రముఖుల్లో టైగర్ ముందుంటారు. ప్రేయసి అందాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తారు. అయితే ఈ జంట ఇటీవల విడిపోయింది. విడిపోయిన స్నేహితులుగా కొనసాగాలని నిర్ణయించుకున్నారని సమాచారం.

టైగర్ ష్రాఫ్ స్నేహితుల్లో ఒకరు వీరి బ్రేకప్ విషయాన్ని ధ్రువీకరించారు. గత కొన్ని వారల్లోనే ఈ విషయం తనకు తెలిసిందని తెలిపారు. ప్రస్తుతం దిశా పటానీ నటించిన ఏక్ విలన్ రిటర్న్స్ విడుదలకు సిద్ధంగా ఉంది. మరోపక్క టైగర్ ష్రాఫ్ సోమవారం నాడు తన కొత్త సినిమా గురించి ప్రకటన చేశాడు. స్క్రూ ధీలా అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ రెండు సినిమాలకు ఇద్దరు ఒకరికొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో విషెస్ చెప్పుకున్నారు.
