డార్లింగ్ స్టైలిష్ ప్రమోషన్

ఆలియా భట్ – విజయ్ వర్మ భార్యభర్తలుగా నటించిన బాలీవుడ్ సినిమా ‘డార్లింగ్స్’. ఈ కామెడీ డ్రామా జస్మీత్ కె. రీన్ దర్శకత్వంలో డార్లింగ్స్ తెరకెక్కింది. ఫాలీ షా, రోషన్‌ మ్యాథ్యూ కీలక పాత్రల్లో నటించారు. ఆగస్టు 5 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో వేగం పెంచింది చిత్ర యూనిట్. ఈ సినిమా ప్రమోషన్స్ బాధ్యతలను అలియా పూర్తిగా తన భుజాలపై వేసుకుంది.

బుధవారం డార్లింగ్స్ ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొన్న ఆలలియా..  స్టైలిష్ లుక్ లో మెరిసింది. మరోసారి తనదైన మార్క్ చూపించింది. ప్రస్తుతం అలియా గర్భవతి. అలాగాని రెస్ట్ తీసుకోకుండా పని చేస్తోంది. ఇటీవలే హాలీవుడ్ సినిమా షూటింగ్ లో పాల్గొని వచ్చింది. తిరిగొచ్చాక కూడా విశ్రాంతి తీసుకోవడం లేదు. ఓ వైపు బ్రహ్మాస్త్ర, మరోవైపు డార్లింగ్స్ సినిమాలకు పబ్లిసిటీ తీసుకొచ్చే పనిలో ఉంది.